ఎఫ్‌టీఎల్ దాచి అమ్మిన బిల్డర్లపై చర్యలు
బీఆర్‌ఎస్ నేతల మొసలి కన్నీరు
రూ.5 వేలు ఇచ్చి సీఎంపై సోషల్ మీడియాలో దుష్ఫ్రచారం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
హైదరాబాద్ :
మూసీ పరివాహన ప్రాంతా బాధితులను తమ బిడ్డల్లా చూసుకుంటామన్నారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. హైదరాబాద్ సీఎల్‌పీ ఆఫీసులో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్‌తో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. హైడ్రా బూచి చూపించి కొంతమంది అవకాశ వాదులు రెచ్చగొట్టే పనిలో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. మూసి నీ పరిరక్షించుకోవాలని తమ ప్రభుత్వం భావిస్తోందని, పెదలను ఇండ్లను కూల్చడానికి ఎప్పుడూ తమ ప్రభుత్వం సిద్దంగా లేదన్నారు. రివర్ బెడ్ లో ఉన్న అక్రమ నిర్మాణాలు తొలగిస్తామని అధికారులు చెప్పారని, మూసి బాధితులకు డబులు బెడ్ రూం ఇండ్లు ఇస్తున్నట్లు ఆయన గుర్తు చేశారు. మూసి లో స్వచ్ఛమైన నీటిని పారించాలని ప్రయత్నం చేస్తున్నామని, మూసి లోకి గోదావరి నీళ్లు తెస్తామని, లింక్ రోడ్లు వేస్తామని చెప్పారు. ఎన్జీవోల సలహాలు సూచనలతో ముందుకు వెళ్తున్నామని, రివర్ బెల్ట్ లో భూసేకరణ చట్టం అమలు చేస్తామని స్ఫష్టం చేశారు. బీఆర్‌ఎస్ లోని కొందరు నేతలు బూతద్దం లో పెట్టీ చూపెట్టే పనిలో ఉన్నారని మండి పడ్డారు. అనుమతులపై ఎవరు ఒత్తిడి తీసుకొచ్చారో త్వరలో బయట పెడుతామన్నారు. త్వరలో హైడ్రా.. మూసి పరివాహక ప్రజల అనుమానాల పై కలెక్టరేట్ లో హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేస్తామన్నారు. బీఆర్‌ఎస్ హయాంలో మల్లారెడ్డి అనే రైతు చితి పెట్టుకుని నిప్పు అంటించుకున్న విషయాన్ని గుర్తు చేశారు శ్రీధర్ బాబు.
ప్రాజెక్టులు కడితే తమ ఇండ్లు కూడా పోయాయి అని కేసీఆర్ గతంలో అన్నారని, ఇప్పుడేమో ప్రజల్ని ఉసికొలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమది ప్రజా పాలన అని, బాధితుల వద్దకు కూడా బీఆర్‌ఎస్ వారిని వెల్లనిచ్చామని, సలహాలు ఇస్తారని అడ్డుకోలేదన్నారు. నోటీసులు ఇచ్చిన తర్వాతనే అధికారులు చర్యలు తీసుకుంటున్నారని, సోషల్ మీడియా లో రూ. ఐదు వేలు ఇచ్చి సిఎం పైనా మాట్లడిస్తున్నారని..వాటిపై విచారణ జరిపిస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలు ఇచ్చిన అధికారులు, బిల్డర్స్ పై చర్యలు ఉంటాయని, తప్పుడు పెపర్స్ తో అనుమతులు ఇచ్చిన వారిపైనా చర్యలు ఉంటాయని చెప్పారు.
మూసీ బాధితులను బిడ్డల్లా చూసుకుంటాం

- Advertisment -