Mushir Khan: ఇటీవల ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్ లో ప్రతిభ చూపిన యువ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ అందరి ప్రశంసలు పొందారు. తాజాగా అతడి తమ్ముడు ముషీర్ ఖాన్ రంజి ట్రోఫీ ఫైనల్ లో ఏకంగా సచిన్ టెండూల్కర్ రికార్డును బ్రేక్ చేశాడు. రంజీ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్లో విదర్భపై 136 పరుగులు చేసిన ముషీర్ ఖాన్.. రంజీ ఫైనల్ లో సెంచరీ చేసిన అతి చిన్న వయస్కుడిగా పేరు పొందాడు. 19 ఏళ్ల 14 రోజుల వయసులో ముషీర్ ఖాన్ సెంచరీ బాదాడు. అయితే సచిన్ టెండూల్కర్ 1994-95 సీజన్ ఫైనల్లో పంజాబ్ పై ఏకంగా రెండు సెంచరీలు నమోదు చేశాడు. కానీ అప్పుడు సచిన్ వయసు 22 ఏళ్ళు లోపు ఉంది. దీంతో రంజీ ఫైనల్ లో సెంచరీ కొట్టిన అతి చిన్న వయస్కుడిగా ముషీర్ ఖాన్ రికార్డుల్లోకెక్కాడు. కాగా ఈ ఏడాది ఐసీసీ అండర్- 19 వరల్డ్ కప్ లోనూ భారత జట్టులో ముషీర్ ఖాన్ తన ప్రతిభ చూపాడు.
Mushir Khan: సచిన్ రికార్డు బ్రేక్ చేసిన ముషీర్ ఖాన్..
- Advertisment -