సైబర్ క్రైమ్ కేసులో ఓ వ్యక్తి అరెస్టు ?
మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంకు ఖాతా
పరారీలో పలువురు, ఇందులో మహిళ..
కరీంనగర్ – జనత న్యూస్
గతంలో సైబర్ క్రైమ్ నేరస్తులు ఇతర రాష్ట్రాలు, విదేశాల్లో ఉన్నట్లు చూశాం, విన్నాం. తాజాగా తెలంగాణలో అందులో కరీంనగర్‌లో సైబర్ నేరాల మూలాలున్నట్లు తెలుస్తుంది. ముంబాయి ఈస్ట్ రీజియన్ సైబర్ పోలీసులు కరీంనగర్ రాకతో వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ముంబాయిలో ఓ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన అక్కడి పోలీసులు సాంకేతిక ఆధారాలు గుర్తించి కరీంనగర్‌కు వచ్చి విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది. కరీంనగర్ లోని ఒక ప్రముఖ ప్రైవేట్ బ్యాంకు లో మందాని ఇంపాడ్ పూర్ వెల్ఫేర్ ట్రస్ట్ పేరున బ్యాంకు ఖాతాను సెక్రటరీ, ట్రేసరీ వివిధ హోదాల్లో మొత్తం (07) ఏడుగురు సభ్యత్వాన ఒకే ఖాతాను తెరిచినట్లు ముంబై ఈస్ట్ రీజియన్ సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. ప్రస్తుతానికి సుభాష్ నగర్ కు చెందిన ఫరూక్ అహ్మద్ (40) అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్న ముంబై పోలీసులు.. అతన్ని విచారిస్తుట్లు సమాచారం. ఈ కేసుతో సంబంధం ఉన్న ఇతర నిందితులు, మరో మహిళ పరారీలో వున్నారని సమాచారం.