Mukesh Ambani: దేశంలోని కుబేరుల జాబితా విడుదలయింది. ‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ ప్రకారం దేశంలో అత్యంత ధనవంతుడు మరోసారి ముఖేష్ అంబానీ మొదటి స్థానాన్ని దక్కించుకున్నాడు. రూ.8.98 లక్షల కోట్ల సంపదతో పై అగ్రస్థానంలో నిలిచారు. ఆయన తరువాత గౌతమ్ అదానీతో మరో 28 మంది పేర్లను మంగళవారం విడుదల చేశారు. ఆగస్టు 30 నాటికి వీరి సంపదను లెక్కించి జాబితాను రూపొందించారు. ఆ వివారాల్లోకి వెళితే..
‘360 వన్ వెల్త్ హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2023’ తాజాగా 1329 మంది కుబేరుల వివరాలను విడుదల చేసింది. దేశంలోని 138 నగరాల నుంచి చేసిన అధ్యయనం ప్రకారం అందరికంటే ఎక్కువ సంపాదనలో ముఖేష్ అంబానీ ముందుకున్నారు. రిలయన్స్ అధినేత సంపద 2 శాతం వృద్ధి చెంది రూ.8.98 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ తరువాత గౌతమ్ అదానీ 57 శాతం క్షీణించి 4.74 శాతంలో నిలిచింది. దీంతో ఆయన రెండో స్థానానికి పరిమితం అయ్యారు.
ఆ తరువాత సీరమ్ ఇనిస్టిట్యూట్ అధిపతి సరస్ పునావాలా నిలిచారు. ఈయన సంపద విలువ 36 శాతం పెరిగింది. హెచ్ సీఎల్ టెక్ వ్యవస్థాపకులు శివ్ నాడార్ 23 శాతం పెంచుకొని నాలుగోస్థానంలో నిలాచారు. 5వ స్థానాన్ని అగ్రగామి -10 అధినేత గోపిచంద్ హిందూజా దిలీప్ సంఘ్వీ, ఎల్ ఎన్ మిత్తల్, కుమార మంగళం బిర్లాలు తమ స్థానాలను మెరుగుపరుచుకున్నారు.