మాల్దీవుల అధ్యక్షులు మహ్మద్ ముయిజ్టు భారత పర్యటన అత్యంత ఆసక్తి రేపుతోంది. గతంలో భారత పర్యాటకులు బైకాట్ చేయడంతో బాల్దీవుల్లో పర్యటక రంగం కుదేలైంది. తాజాగా ఐదు రోజుల భారత పర్యటనలో ఆదివారం ఢల్లీికి చేరుకున్న ముయిజ్జు..మన దేశంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్బంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూల్లో పలు ఆసక్తి కలిగించే అంశాలను వెల్లడిరచారు ముయిజ్జు. తమ దేశంలో భరత పర్యాటకులకు పూర్తి స్థాయి సాకారం అందిస్తామని, ఈ దేశ భద్రతను దెబ్బతీసేలా వ్యవహరించ బోమని స్పష్టం చేశారు. వాణిజ్య భాగస్వామ్య దేశంగా భారత్ ఉందన్న ముయిజ్జు, తమ సాకారాన్ని పెంపొందించుకుంటామని స్పష్టం చేశారు. కాగా..గతంలో మాల్దీవ్ మంత్రులు చేసిన కామెంట్స్, ఆ తరువాత వారి తొలగింపు..భారత్ ప్రదాని నరేంద్ర మోదీ తీసుకున్న నిర్ణయాలతో లక్ష్యదీప్ పర్యాటకంగా ఘననీయ అభివృద్ధి చెందుతుంది. అప్పటి నుండి మాల్దీవుల పర్యాటక రంగం దెబ్బతింది. తాజాగా ముయిజ్జు పర్యటన ఆసక్తి కలిగిస్తుంది.
ముయిజ్జు విజ్ఞప్తిని భారత పర్యాటకులు స్వీకరిస్తారా..?

- Advertisment -