కరీంనగర్, జనతా న్యూస్: బీజెపి జాతీయ ప్రధానకార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి రెండవసారి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి బిజెపి అభ్యర్థిగా పోటీచేసే అవకాశం కల్పించిన బిజెపి జాతీయ నాయకత్వం అధికారిక ప్రకటన నేపథ్యంలో బెజ్జంకి మండల కేంద్రంలో అంబేద్కర్ స్టాచ్ వద్ద బిజెపి మండలశాఖ అధ్యక్షుడు కొలిపాక రాజు నేతృత్వంలో టపకాయలు కాల్చి స్వీట్లు పంచుకొని సంబరాలు చేసుకొని జాతీయ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కొలిపాక రాజు , మండల ప్రధాన కార్యదర్శి ముస్కె మహేందర్ , మండల ఉపాధ్యక్షుడు కొత్తపేట రామచంద్రం, మండల అధికార ప్రతినిధి కచ్చు సంపత్ , మండల కార్యదర్శి వడ్లూరు శ్రీనివాస్ , మండల ఓబీసీ అధ్యక్షులు బండిపల్లి సత్యనారాయణ , మండల యువమోర్చా అధ్యక్షులు తూముల రమేష్ , బెజ్జంకి పట్టణ అధ్యక్షుడు సంగా రవి , మండల సీనియర్ నాయకులు శీలం వెంకటేశం , యువ మోర్చా మండల అధికార ప్రతినిధి అన్నాడి అజిత్ , మండల ఓబీసీ ఉపాధ్యాయులు మంగలరాపు వేణు , రేగులపల్లి శక్తి కేంద్ర ఇంచార్జి గండ్ల శ్రీనివాస్, ముత్తన్నపేట బూత్ అధ్యక్షులు గాజ రాజు , వనపర్తి శివసాయి పాల్గొన్నారు.