కరీంనగర్-జనత న్యూస్
ఎల్ఎండీ డ్యాంలో దూకి ఆత్మహత్యకు యత్నించిన తల్లీ కొడుకును కాపాడారు పోలీసులు. నగరంలోని విద్యానగర్ కు చెందిన చౌడారపు భారతమ్మ (58), చౌడారపు గిరీష్ కుమార్ (34) తల్లి కుమారుడు డ్యాం లోకి దూకేందుకు ప్రయత్నించగా.. డ్యాం కట్టపై గస్తీలో ఉన్న లేక్ అవుట్ పోస్టు పోలీసులు కాపాడారని, లేక్ ఎస్సై అర్షం సురేష్ తెలిపారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యా యత్నానికి కారణమని, వారిని కౌన్సిలింగ్ కొరకు కరీంనగర్ మహిళా పోలీస్ స్టేషన్ కు తరలించామని తెలిపారు.
తల్లీ కొడుకులను కాపాడిన పోలీసులు
- Advertisment -