భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అమెరికా టూర్ సక్సెస్ అయింది. యూఎన్ అసెంబ్లీ సమ్మిట్ ఫర్ ది ఫ్యూచర్ కార్యక్రమంలో ప్రసగించి ప్రశంసలు అందుకున్నారు మోదీ. అస్ట్రేలియా, జపాన్ ప్రధాన మంత్రులతో కలసి చర్చించడంతో పాటు పలు సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు.
అమెరికాకు స్మగ్లింగ్ చేయబడిన 297 చారిత్రాత్మక వస్తువులను మోదీకి తిరిగి ఇచ్చారు బైడెన్. న్యూయార్క్‌లో ప్రవాస భారతీయ సభలో ఆకట్టుకునేలా ప్రసంగించారు. న్యూయార్క్‌లో పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌ను కలుసుకున్నారు . గాజా సంక్షోభంపై ఆందోళన వ్యక్తం చేసిన మోదీ..తమ దేశం శాంతి కోరుకుంటుందని పునరుద్గాటించారు. అమెరికా పర్యటన చివరి రోజు టెక్ కంపెనీల ప్రతినిధులు, ప్రపంచ ప్రఖ్యాత కంపెనీల ప్రతినిధులతో సమావేశమై చర్చించారు. గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్, అడోబ్ సీఈవో శంతను నారాయణ్, తదితర 15 కంపెనీల ప్రతినిధుల సమావేశంలో మోదీ పాల్గొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పుల నేపథ్యంలో టెక్నాలజీ, ఇన్నోవేషన్ తదితర అంశాలపై చర్చించినట్లు ప్రధాన మంత్రి తెలిపారు. ఐక్య రాజ్య సమితి, యూఎన్ సమ్మిట్‌లో భారత ప్రధాని మోది ప్రసంగించారు.
మోదీ యూఎస్ టూర్ సక్సెస్

- Advertisment -