కరీంనగర్, జనతా న్యూస్: భారతదేశ రైల్వే ముఖచిత్రాన్ని కేంద్రంలోని బిజెపి మోడీ ప్రభుత్వం మార్చిందని, అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా ఎయిర్ పోర్ట్ లకు ధీటుగా రైల్వే స్టేషన్ల పునరాబివృద్ది జరుగుతుందని బీజెపి కార్పొరేటర్ కోలగాని శ్రీనివాస్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంగళవారం దేశవ్యాప్తంగా ప్రారంభించిన వన్ స్టేషన్ వన్ ప్రోడక్ట్ కార్యక్రమం , 85 వేల కోట్లకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టుల శంకుస్థాపన , వందే భారత్ రైళ్ల ప్రారంభోత్సవం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ రైల్వే స్టేషన్ లో ఉత్పత్తి స్టాళ్ల ప్రారంభం జరిగింది . ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బిజెపి మోడీ ప్రభుత్వం రైల్వే ను ఎంతో ఆధునికరిస్తుందన్నారు. ప్రయాణికుల కోసం బుల్లెట్ రైలు, వందే భారత్ రైళ్లు తీసుకువచ్చిన ఘనత బిజెపి మోడీ ప్రభుత్వం దేనన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా రైల్వే స్టేషన్ ను నేడు ఆధునికరించడానికి మోడీ ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.
భారత రైల్వే అభివృద్ధి కోసం మోడీ ప్రభుత్వం పెద్ద పీట
- Advertisment -