Mlc Kavitha: న్యూ ఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ క్యాం కేసులో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై ఈనెల 6న తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి కావేరి భవేజా తెలిపారు. మే 2న తీర్పు రిజర్వేషన్లకు చేసిన కోర్టు మే 6వ తేదీన సీబీఐ, ఈడీ కేజీల్లో బెయిల్ పిటిషన్ లపై తీర్పును వెలువరించనున్నట్లు ప్రకటించింది.
సిబిఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. ఈ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 22న కోర్టులో వాదనలు జరిగాయి. దీనిపై రౌస్ అవెన్యూ కోర్టు మే 2 నాటికి రిజర్వ్ చేసింది. కాగా ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కవితను ఈడీ మార్చి 15న అదుపులోకి తీసుకుంది. సిబిఐ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది. దీంతో వీటిపై బెయిల్ పిటిషన్లను వేశారు. ప్రస్తుతం ఆమె 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీలో భాగంగా తీహార్ జైల్లో ఉంటున్నారు.