MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తిహాడ్ జైలులో ఉన్న కవితకు రౌస్అవెన్యూ కోర్టు మరో షాక్ఇచ్చింది. ఎమ్మెల్సీ కవిత వేసిన బెయిల్ పిటిషన్ ను రౌస్ అవెన్యూ కోర్టు మే 2 వరు రిజర్వులో ఉంచింది. ఈ కేసులో కవితకు బెయిల్ఇవ్వొద్దని సీబీఐ తరుపున న్యాయవాది వాదంచారు. కవిత దర్యాప్తును ప్రభావితం చేయగలుగుతారని, లిక్కర్ కేసులో ఆమె కీలకంగా ఉన్నారని అన్నారు.అయితే కవిత తరుపున లాయర్ మాట్లాడుతూ కవిత అరెస్టు నుంచి విచారణ వరకు ఎటువంటి ఆధారాలు లేవని అన్నారు. ఈడీ కస్టడీలో ఉండగా సీబీఐ ఎందుకుఅరెస్ట్ చేసిందని అన్నారు. అరెస్ట్ చేయాల్సిన అవసరం లేనప్పటికీ కావాలనే అరెస్ట్ చేశారని అన్నారు. కవిత ప్రస్తుతం స్టార్ క్యాంపెయిన్ గా ఉన్నారు. అలాగే ఏడేళ్లలోపు శిక్ష పడేకేసులకు అరెస్ట్ అవసరం లేదన్నారు.
MLC Kavitha: కవిత కు మరోషాక్ ఇచ్చిన కోర్టు..
- Advertisment -