న్యూఢిల్లీ: మద్యం స్కాంలో నిందితురాలిగా ఉన్న ఎమ్మెల్సీ కవితను తిహార్ జైలుకు పంపించనున్నారు. ఈ కేసులో కవిత మంగళవారం వరకు కస్టడిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమెను ఈడీ అధికారులు రౌస్ అవెన్యూ కోర్టులో హాజరు పరిచారు. ఈడీ తరఫున న్యాయవాది జోయయ్ హుస్సేన్ ఆన్లైన్లో వాదనలు వినిపించారు. 15 రోజుల జ్యుడీషియల్ కస్టడికి పంపాలని కోరారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉందని, పలువురు నిందితులను ఇంకా ప్రశ్నిస్తున్నట్లు పేర్కొన్నారు. కవిత కుమారుడికి పరీక్ష షెడ్యూల్ విడుదల అయిందని ఆమె తరపున న్యాయవాది కోర్టుకు వెల్లడించారు . మధ్యంతర బెయిల్ మంజూరు చేయాలని కోరారు. అయితే ఇరువైపులా వాదనలు విన్న కోర్టు కవితకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏప్రిల్ 9 వరకు ఆమె తిహార్ జైలుకు పంపనున్నారు. మరోవైపు కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 1న విచారణ చేపట్టినట్లు తెలిపారు.
Mlc Kavitha: ఎమ్మెల్సీ కవితకు 14 రోజు జ్యూడీషియల్ రిమాండ్
- Advertisment -
