అల్ఫోర్స్ అధినేత నరేందర్ రెడ్డి శంఖారావం
కరీంనగర్-జనత న్యూస్
కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికకు ఆరు నెలల ముందుగానే ప్రచార శంఖారావాన్ని పూరించారు అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ నరేందర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు. వేద మంత్రాల మధ్య అర్చకుల ఆశీర్వచనాలు అందుకుని, విద్యాసంస్థల యాజమాన్యాలు, అభిమానులు, శ్రేయోభిలాషుల నడుమ తల్లిదండ్రులచే రిబ్బన్ కటింగ్ చేయించారు నరేందర్ రెడ్డి. పట్టభద్రుల సంక్షేమానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అధిక మెజారిటీతో తను గెలిపిస్తారన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. గత కొద్ది రోజులుగా పలు విద్యా సంస్థలను సందర్శిస్తూ వచ్చిన నరేందర్ రెడ్డి..ఆయా ప్రాంతాల్లోని పట్టభద్రులను మద్దతు కోరుతూ ఆకట్టుకుంటున్నారు. అటు ప్రభుత్వ, ఇటు ప్రయివేటు విద్యా సంస్థలను ఆయన సందర్శిస్తున్నారు. విద్యార్థి సంఘాల కార్యక్రమాల్లోనూ విరివిగా పాల్గొంటున్నారు. పార్టీ నుండి టికెట్ రాకున్నప్పటికీ, పట్టభద్రుల ఎమ్మెల్సీ బరిలో నిలుస్తాననే సంకేతాలిచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి..

- Advertisment -