Saturday, March 14, 2026

చెన్నకేశవ స్వామి ఆలయంలో ఎమ్మెల్యే పూజలు

తిమ్మాపూర్, జనతా న్యూస్: మండలంలోని మొగిలి పాలెంలోని శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయంలో   మానకొండూర్ ఎమ్మెల్యే  కవ్వంపల్లి సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  మొగిలిపాలెం గ్రామంలో జరుగుతున్న శ్రీలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు మానకొండూర్ నియోజకవర్గ శాసనసభ్యులు  సోమవారం సాయంత్రం హాజరు కాగా పూర్ణకుంభంతో ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారిని ఎమ్మెల్యే దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే ని ఆలయ అర్చకులు సన్మానించి ఆశీర్వచనాలు అందించారు. ఎమ్మెల్యే వెంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రమణా రెడ్డి, గ్రామస్తులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page