జనతా న్యూస్ బెజ్జంకి : మెదడులో కణతితో బాధపడుతున్న దాచారం గ్రామానికి చెందిన దెయ్యాల కనకవ్వ అనే వృద్ధురాలికి 2 లక్షల 50వేల రూపాయల సీఎంఆర్ఎఫ్ ఎల్ వో సి నీ మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వృద్ధురాలి కుమారుడైన దెయ్యాల రాజుకు బెజ్జంకి మండల కేంద్రంలో ఆదివారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మాట తప్పని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని మానకొండూరు ప్రజలను కంటికి రెప్పలా చూసుకుంటానని ఎవరు ఏ అవసరం ఉన్నా నిర్భయంగా తనకు తెలియజేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఒగ్గు దామోదర్, కాంగ్రెస్ పార్టీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అక్కర వేణి పోచయ్య, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు పులి కృష్ణ, మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు మాంకాల ప్రవీణ్, బెజ్జంకి మాజీ సర్పంచ్ రావుల నరసయ్య, కాంగ్రెస్ నాయకులు జెల్ల ప్రభాకర్, గూడెల్లి, శ్రీకాంత్, పులి సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
ఎల్ ఓ సి అందించిన ఎమ్మెల్యే
- Advertisment -
