జనత న్యూస్ బెజ్జంకి : మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ బెజ్జంకి మండలం గుగ్గిళ్ళ గ్రామంలో తన అనుచర గణంతో కలిసి మార్నింగ్ వాక్ లో గ్రామం మొత్తం కలియ తిరుగుతూ ప్రజలతో మమేకం అవుతూ ప్రజా సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. గ్రామంలోని చెక్ డాం కాలువ, తెగిపోయిన జాలు కాలువను, వింజపెల్లి వెళ్ళుటకు కాజ్వే ఏర్పాటు పనులు పరిశీలించారు. గ్రామంలోని తుల శాల స్రవంతి అనే వికలాంగురాలకు వీల్ చేర్ ఇస్తా అనే హామీ ఇచ్చారు. అలాగే ఇటీవల మరణించిన పారిశుధ్య కార్మికురాలు బోయిని సరవ్వ కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం బాల వికాస సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముక్కిస రత్నాకర్ రెడ్డి, మాజీ సర్పంచ్ చెప్యాల శ్రీనివాస్ గౌడ్, గ్రామ శాఖ అధ్యక్షుడు తిప్పరవెని బాబు, శ్రావణ్ కుమార్, దూశెట్టి రాజు రెడ్డి, మైల బాలయ్య, కెడిక లచ్చిరెడ్డి, తిరుపతి రెడ్డి, రేవోజు శంకర్, కెడిక కృష్ణారెడ్డి, కొంకటి రాజయ్య, నంగునూరు బాలయ్య, చెప్యాల సారయ్య, తులశాల రాజశేఖర్, చెప్యాల రాజు, బోయిని ప్రశాంత్, చెప్యాల లక్ష్మణ్, రేవోజు శేఖర్, సీత శివ, తదితరులు పాల్గొన్నారు.
గుగ్గిల్లలో ఎమ్మెల్యే మార్నింగ్ వాక్
- Advertisment -