– కమలాపూర్ మండలం శనిగరం రోడ్ షో తో బీఆర్ఎస్ లో ఫుల్ జోష్
హనుమకొండ, జనతా న్యూస్: పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హుజురాబాద్ నియోజకవర్గం లోని కమలాపూర్ మండలం శనిగరం గ్రామంలో రోడ్ షో సినిమా రేంజ్ ను తలపించింది. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సోమవారం ప్రచారంలో భాగంగా వీణవంక నుంచి భారీ కాన్వాయ్ తో యలుదేరారు. సుమారు 500 వాహనాలతో రోడ్ షో కు బయలుదేరారు. కిలోమీటర్ల పొడవునా కాన్వాయ్ తో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వెళుతుండడంతో హుజురాబాద్ లోని బీఆర్ఎస్ నాయకుల్లో కొత్త జోష్ నింపింది. రోడ్ షో సందర్భంగా వీణవంక నుంచి బయలుదేరిన కౌశిక్ రెడ్డికి అడుగున ప్రజలు నీరాజనం పడుతూ మంగళహారతులతో స్వాగతం పలికారు. దారి వెంట కాన్వాయ్ జై బీఆర్ఎస్ నినాదాలతో హోరెత్తించారు.

రోడ్ షోలో శనిగరం చేరుకోగానే ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికి కౌశిక్ రెడ్డి తోపాటు పార్లమెంటు బి ఆర్ ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ పై పూల వర్షం కురిపించారు. రోడ్ షో లో భాగంగా మహిళలు అధిక సంఖ్యలో హాజరై బీఆర్ఎస్ కు మద్దతు తెలపడంతో నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక శనిగరం ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దంపతులు మహిళలతో కలిసి డ్యాన్స్ చేశారు. అనంతరం పార్లమెంట్ అభ్యర్థి వినోద్ కుమార్, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బిజెపి, కాంగ్రెస్ పార్టీలపై దుమ్మెత్తి పోశారు. ప్రజలు మల్ల కేసీఆర్ సర్కార్ రావాలని కోరుకుంటున్నారని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా వినోద్ కుమార్ గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీగా వినోద్ కుమార్ గెలిస్తే జోడేడ్ల లాగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ తడక రాణి శ్రీకాంత్, జెడ్పిటిసి లాండిగే కళ్యాణి లక్ష్మణరావు, సింగిల్ విండో డైరెక్టర్ ఎర్రం ఇంద్రసేనారెడ్డి, గెలు శ్రీనివాస్ యాదవ్, నారదాసు లక్ష్మణరావు, నియోజకవర్గ సీనియర్ నాయకులు తక్కలపల్లి సత్యనారాయణ రావు, ప్రజా ప్రతినిధులు, లీడర్లు పాల్గొన్నారు.
