భారత దేశ అత్యున్నత దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు ప్రముఖ బాలివుడ్ నటుడు మిథున్ చక్రవర్తి. సినిమా రంగంలో విశిష్ట ప్రతిభ చూపిన వారికి ఈ అవార్డు అందజేస్తారు. ఇందులో భాగంగా సుదీర్ఘ కాలంగా సినీ రంగంలో తన నటనతో ప్రేక్షకుల ఆదరాభిమానాలు చూరగొని తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మిథున్ చక్రవర్తికి ఈ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ విషయాన్ని కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ వేదికపై ప్రకటించారు. అక్టోబర్ 8న జరిగే జాతీయ చలన చిత్ర వేడుకల్లో అవార్డు ప్రధానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. మిథున్ చక్రవర్తి గతంలో పద్మభూషన్ అవార్డు పొందగా..తాజాగా దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుకు ఎంపికయ్యారు. 1976లో మృగయా సినిమాతో తొలి వెండి తెరకు పరిచయమైన ఆయన..జాతీయ ఉత్తమ నటుడిగా ఎంపియ్యారు. 1979, 80లో వచ్చిన నపలు సినిమాలు ప్రేక్షకులను ఊర్రూత లూగించాయి.
మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు..

- Advertisment -