Mithun Chakaravarthy: బాలీవుడ్ ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి తీవ్ర అస్వస్థకు గురయ్యారు. శనివారం ఆయనకు చాతిలో నొప్పి రావడంతో కలకత్తాలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. పశ్చిమ బెంగాల్ కు చెందిన మిథున్ చక్రవర్తి బోజ్ పురి, హిందీ, తమిళం, కన్నడంతో పాటు తెలుగులోనూ నటించారు. 1982లో వచ్చిన ‘డిస్కో డ్యాన్సర్’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ‘గోపాల గోపాల’ సినిమాలో నటించి ఆకట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన తృణమూల్ కాంగ్రెస్ తరుపున రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. ఇటీవలే మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషన్ తో సత్కరించింది.
Mithun Chakaravarthy: బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి తీవ్ర అస్వస్థత
- Advertisment -