కరీంనగర్-జనత న్యూస్
విమర్శలు`ప్రతి విర్శలు చేసుకునే అధికార, ప్రతిపక్ష నేతలు ఒకేచోట కలిశారు. కరీంనగర్‌లో నిన్న గణేశ్ నవరాత్రి పూజోత్సవంలో కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఓకే చోట తారాస పడడం ఆసక్తి నెలకొంది. దీంతో పాటు ఆదివారం నగరంలోని పలు కార్యక్రమాల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే కమలాకర్, మేయర్ సునిల్ రావు కలసి పాల్గొన్నారు. లేపాక్షి ఆసుపత్రి, సాఫ్‌రాణి హౌజ్‌ను వారు కలసి ప్రారంభించడం చర్చనీయాంశంగా మారింది. కొద్ది సంవత్సరాలుగా ఎక్కడా కలసి కనిపించని బీఆర్‌ఎస్, బీజేపీ ప్రజాప్రతినిధులు.. ఇలా ఒకే చోట కలసి కార్యక్రమాల్లో పాల్గొని సంతోషంగా గడపడం చర్చనీయాంశంగా మారింది.

