లబ్ధిదారుల ఆశలు !
కొత్త రేషన్ కార్డులపై సంగ్దిద్ధం
ఆదాయ పరిమితి, నిబంధనలపై ఆందోళన
పెండిరగ్ దరఖాస్తులు బుట్టదాఖలు ?
జనత న్యూస్-కరీంనగర్ ప్రతినిధి
వచ్చే నెలలో కొత్త రేషన్ కార్డుల జారీకి తెలంగాణ సర్కారు ప్రణాళిక రూపొందిస్తోంది. స్మార్ట్ కార్డు ద్వారా బియ్యం పంపిణీ చేయాలనే యోచనలో ఉన్నట్లు మంత్రి వర్గ ఉప సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక్కడి వరకు బాగానే ఉన్నా..ప్రస్తుతమున్న రేషన్ కార్డుల్లో కోత విధిస్తుందా..? గత ఆదాయ పరిమితినే కొనసాగిస్తుందా..పెంచనుందా.? కార్డు ద్వారా బియ్యం మాత్రమే సరఫరా చేస్తుందా..లేక ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఇతర సరుకులు కూడా పంపిణీ చేస్తుందా..? ప్రభుత్వ పథకాల లబ్ధి, ఇతర సంక్షేమాలకు ప్రామాణికంగా స్మార్ట్ కార్డును గుర్తిస్తారా..? కేవలం సరుకులకే పరిమితం చేస్తారా..? ఇలా అనేక సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధికి రేషన్ కార్డును ప్రమాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. దారిద్రియ రేఖకు దిగువనున్న వారిని గుర్తిస్తూ పెన్షన్, ఇల్లు మంజూరు, రాజీవ్ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు, పిల్లలకు స్కాలర్‌షిప్స్, రాయితీ రుణాలు..ఇలా ఆయా శాఖల్లో లబ్ధి కోసం రేషన్ కార్డునే ప్రమాణికంగా తీసుకుంటున్నాయి ప్రభుత్వాలు. గత పదేళ్లుగా రేషన్ కార్డుల జారీ, లబ్ధి తదితర అంశాల్లో గందర గోళ పరిస్థితుల్లో వేలాది కుటుంబాలు లబ్ధి పొందలేక పోయాయి. గతంలో మంజూరు చేసిన కార్డులు, వినియోగంపై అనేక ఆరోపనలున్నాయి. వీటికి పులిస్టాప్ పెట్టాలని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం యోచిస్తుంది. ఇందులో భాగంగా రేషన్ కార్డుల జారీకి పకడ్భందీగా విధి విధానాలను రూపొందించే పనిలో ఉంది.
వచ్చే నెలలో కొత్త రేషన్‌కార్డుల జారీకి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు మంత్రి వర్గ ఉప సంఘం ప్రకటించడంతో సర్వత్రా చర్చ జరుగుతోంది. 2023 నేషనల్ ఫుడ్ సెక్యురిటీ యాక్ట్ మేరకు రేషన్ కార్డులు జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. అయితే..కేంద్ర ప్రభుత్వ నిబంధనలను కొంత సవరించి అదనంగా లబ్ధిదారులకు రేషన్ కార్డులు చేశాయి గత రాష్ట్ర ప్రభుత్వాలు. దీని ద్వారా అదనపు కార్డుదారులకు అందించే బియ్యం భారాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సర కుటుంబ ఆదాయం రూ. 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాలకు రూ. రెండు లక్షల పరిమితితో కార్డులు జారీ చేశాయి ప్రభుత్వాలు. పదకొండేండ్ల తరువాత ప్రస్తుత సగటు పేద, మధ్య తరగతి కుటుంబ ఖర్చులు, పెరిగిన సరుకుల ధరలకు అనుగుణంగా రేషన్‌కార్డు ఆదాయ పరిమితి పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనితో పాటు ఎప్పటికప్పుడు రేషన్ కార్డుల జారీ, చేర్పులు`మార్పులు చేసే విధంగా చర్యలు చేపట్టాలని పలువురు సూచిస్తున్నారు.
కరీంనగర్ జిల్లాలో రేషన్ కార్డులు..
కరీంనగర్ జిల్లాలో రెండు లక్షలా 57 వేలా 752 రేషన్ కార్డులు, 15 వేలా 791 కుటుంబాలకు అంత్యోదయ, మరో 42 మందికి అన్నపూర్ణ కార్డులున్నాయి. రేషన్ కార్డుల ద్వారా ఒక్కో వ్యక్తికి ఆరు కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేస్తుంది ప్రభుత్వం. అంత్యోదయ కుటుంబాలకు 35 కిలోల చొప్పున, అన్నపూర్ణ కార్డు దారులకు 10 కిలోల చొప్పున రేషన్ బియ్యం అందిస్తున్నారు. 2021 జూలై మాసంలో జిల్లాలో ఆరు వేలకు పైగా కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేశారు. అప్పుడు చేపట్టిన ఎంపిక ప్రక్రియపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. దరఖాస్తు చేసిన వారిలో 25 శాతం మందికి కూడా కార్డులు మంజూరు కాలేదనే ఆరోపనలున్నాయి. గత పదేళ్లుగా వేలాది మంది రేషన్ కార్డుల కోసం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.
కొత్తగా దరఖాస్తులు చేసుకోవాల్సిందేనా..?
రేషన్ కార్డుల మంజూరు కోసం జిల్లాలో సుమారు 15 వేల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. తహసీల్దార్, జిల్లా కలెక్టరేట్‌లో దరఖాస్తు పత్రాలు అందజేశారు. వీరు కాకుండా సైట్‌లో ఆన్‌లైన్ దరఖాస్తు కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తున్నాయి పేద, మధ్య తరగతి కుటుంబాలు. ప్రస్తుత మంత్రివర్గ ఆలోచన తీరు చూస్తే..ఆ దరఖాస్తులు బుట్టదాఖలైనట్లే నని అర్థమౌతుంది. రేషన్‌కార్డు లేక పోవడంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ఆరోగ్య శ్రీ లాంటి వైద్య సేవలకూ ఇనాళ్లూ దూరమైన కుటుంబాలు కరీంనగర్ జిల్లాలో వేల సంఖ్యలో ఉన్నాయి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వమైనా పేద, మధ్య తరగతి వర్గాలకు అన్యాయం జరుగకుండా అర్హులందరికీ రేషన్ కార్డులు జారీ చేయాలని పలువురు కోరుతున్నారు.
మంత్రి వర్గ ఉప సంఘం నిర్ణయాలపైనే..

- Advertisment -