కరీంనగర్, జనతా న్యూస్: మంత్రి పొన్నం ప్రభాకర్ ఇస్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని, అయనను వెంటనే భర్తరఫ్ చేయాలని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన శనివారం మాట్లాడుతూ ప్రజలు తనను ఓట్లు వేసి గెలిపించారన్నారు. కానీ అధికార కార్యక్రమాల్లో తనను జోక్యం చేసుకోవద్దని అధికారులకు చెప్పడం విడ్డూరంగా ఉందని అన్నారు. అధికారులు ప్రొటోకాల్ పాటించేలా చూడకుండా వారికి ఫోన్ చేసి వద్దని చెప్పడం తగదని ఉందన్నారు. మంత్రి స్థాయిలో ఉండి పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని, ఆయన ఆవేశం స్టార్ గా మారారని అన్నారు. కల్యాణ లక్ష్మీ చెక్కులు తనతో పంపిణీ చేయొద్దని పొన్నం ఎమ్మార్వోలతో మాట్లాడిన ఆడియోలు బయటకు వచ్చాయని అన్నారు. ఆర్డీవోపై చర్యలు తీసుకుంటే మంత్రిపొన్నంపై కూడా చర్యలు తీసుకోవాలని అన్నారు.
మంత్రి పొన్నం ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు: ఎమ్మెల్యే
- Advertisment -
