విజయవాడ, జనత న్యూస్: ఉమ్మడి రాజధానిపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వాఖ్యలు చేశారు. మంగళవారం వైసీపీ సీనియర్ నేత వైవి సుబ్బారెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా హైదరాబాద్ ఉండాలని చేసిన వాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై మంత్రి బొత్స సత్యనారాయణ బుధవారం మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనేది తమ పార్టీ విధానం కాదని అన్నారు. వై వి సుబ్బారెడ్డి వ్యాఖ్యలను వక్రీకరించారని అన్నారు. అనుభవం ఉన్న నేత ఎవరైనా ఉమ్మడి రాజధాని వ్యాఖ్యలు చేస్తారా అంటూ ఎదురు ప్రశ్నలు వేశారు. 10 ఏళ్ల తర్వాత హైదరాబాద్ ఉమ్మడి రాజధాని చేయడం ఎలా సాధ్యమవుతుందని అన్నారు. హైదరాబాద్ విశ్వనగరం అని, అది ఏమైనా వేముల ప్రశాంత్ రెడ్డి సొంత ఆస్థానమా అని మంత్రి అన్నారు. తాటాకు చప్పులకు భయపడేది లేదని ఈ సందర్భంగా చెప్పారు. చంద్రబాబు అర్ధరాత్రి పారిపోయి వచ్చిన కారణంగా ఇప్పుడు రాష్ట్రానికి రాజధాని లేకుండా పోయిందని ఆరోపించారు
ఉమ్మడి రాజధానిపై మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు
- Advertisment -