తిమ్మాపూర్-జనత న్యూస్
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని ఎల్‌ఎండీ స్వాతంత్ర సమరయోధుల ట్రస్ట్ మానసిక వికలాంగుల పాఠశాలలో సురభి స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో సేవ కార్యక్రమం నిర్వహించారు. ధర్మపురి ఎమ్మెల్యే, విప్ అడ్లూరి లక్ష్మన్ కుమార్ సతీమణి కాంతకుమారి హాజరై పిల్లలకు ఆట వస్తువులు, తిను బండారాలతో పాటు వంట సామాగ్రీని అందజేశారు. అనంతరం వారికి క్రీడా పోటీలు నిర్వహించారు. మానసిక వికలాంగుల పాఠశాలలో ఇలా గడపడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సురభి సంస్థ అధ్యక్షులు పుల్లూరి సత్యనారాయణ, వేముల రవీందర్, డాక్టర్ జి రవీందర్ , రాదండి వెంకటేష్, పురుషోత్తం రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.