డీఎస్సీ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా 11 062 పోస్టులతో నోటిఫికేషన్ వెలువరించింది. గత సెప్టెంబర్ లో రిలీజ్ చేసిన 5,089 పోస్టుల నోటిఫికేషన్ రద్దు చేసిన విషయం తెలిసిందే. గురువారం రిలీజ్ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్ పై అభ్యర్థుల్లో హర్షాలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి టీచర్ పోస్టుల భర్తీ కాలేదు. ఎంతోమంది అభ్యర్థులు టెట్ రాసి నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నారు.అయితే 2023 సెప్టెంబర్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం నోటిఫికేషన్ దారి చేసినా ఎన్నికలు రావడంతో ఆ ప్రక్రియ నిలిచి పోయింది. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం 1,1062 పోస్టులతో నోటిఫికేషన్ రి లీజ్ చేయడం హర్షాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై ఆర్థిక శాఖ ఇప్పటికే ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఈ నోటిఫికేషన్లు బుధవారం వెలువరించాలని నిర్ణయించారు. కానీ సాంకేతిక కారణాలతో గురువారం ఉదయం రిలీజ్ చేశాడు.
1,1062 పోస్టులతో మెగా డీఎస్సీ రిలీజ్
- Advertisment -