Saturday, July 5, 2025

Medaram MahaJathara : భక్తులకు మేడారంలో ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయంటే?

Medaram MahaJathara :వరంగల్, జనతా న్యూస్: మేడారం మహా జాతర బుధవారం నుంచి ప్రారంభం కానుంది. మన దేవతల్లో ఒకరైన సారాలమ్మ బుధవారం మేడారం గద్దమీదకు రానుంది. పగిడిద్దరాజు, గోవిందరాజు కూడా ఇదే రోజు గద్దెపైకి కి వస్తారు సారాలమ్మ మేడారానికి రావడంతో నాలుగు రోజుల మహా జాతర ప్రారంభమవుతుంది. ఈ మేరకు బుధవారం తెల్లవారుజామున నుంచి  సారాలమ్మ కొలువైన కన్నెపల్లిలో ప్రత్యేక పూజ కార్యక్రమాలు ప్రారంభించారు. పొద్దున్నే సార్లమ్మ ఆలయాన్ని శుద్ధిచేసి అలంకరించారు.

భక్తులకు సకల సౌకర్యాలు

కన్నేపల్లీ నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పోనుగొండ్ల నుంచి పగిడిద్దరాజులు గద్దెల పైకి చేరుకుంటారని మంత్రి ధనసూరి అనసూయ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడుతూ జాతర విశేషాలను వివరించారు.  22న చిలకులగుట్ట నుంచి సమ్మక్క తల్లిని ఎస్పి గౌరవ వందనం తో గాలిలో తుపాకీ పేల్చి , పూజారులు గిరిజన సాంప్రదాయాలతో సమ్మక్క తల్లిని వనం నుండి గద్దె పైకి అంగరంగా అంగరంగా వైభవంగా తీసుకొస్తారు అని అన్నారు. 23న అమ్మవార్లు గద్దెలపై కొలువు తీరుతారని ఆ రోజు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారన్నరు. 24న తిరిగి అమ్మవార్లు వన ప్రవేశం చేస్తారని ఆమె తెలిపారు. భక్తులు స్వీయ క్రమశిక్షణ పాటిస్తూ అమ్మవార్ల దర్శనం చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ మహా జాతరకు బస్సులు, ఎడ్లబండ్లు, వ్యాన్ లు వివిధ వాహనాల ద్వారా జాతరకు లక్షలాది మంది ఇప్పటికే చేరుకున్నారన్నారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చే భక్తులకు రవాణాకు ఇబ్బందులు లేకుండా రోడ్లు వెడల్పు చేశామన్నారు. హన్మకొండ నుండి పస్రా, తాడ్వాయి నుండి మేడారం వరకు 4 లైన్ల రోడ్లు వెడల్పు చేశామన్నారు. భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవార్లను దర్శనం చేసుకునేందుకు ఊరట్టం నుంచి పార్కింగ్ స్పాట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

మంచి నీటి సౌకర్యాన్ని ఎక్కువగా పెంచినట్లు తెలిపారు. భక్తులకు బంగారం పంపిణీని రద్దీ లేకుండా రేపటి నుంచి ఏర్పాట్లు చేస్తున్నట్లు అనే చెప్పారు. ఆసియా లోనే అతిపెద్ద జాతరగా గుర్తింపు పొందిన శ్రీ మేడారం సమ్మక్క – సారలమ్మ జాతరను జాతీయ పండుగగా గుర్తించేందుకు ప్రతిపాదనలు చేసినట్లు తెలిపారు. జాతర నిర్వహణకు భక్తుల సౌకర్యార్థం ముఖ్యమంత్రి 110 కోట్లను కేటాయించారన్నారు. సుమారు 60 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు అమ్మవార్ల దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కోటి దాటే అవకాశం ఉన్నట్లు ఆమె తెలిపారు. జిల్లాల్లో ఈ నాలుగు రోజులు సెలవులు ప్రకటించినట్లు వివరించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర మంత్రులు , గవర్నర్ లు అమ్మవార్ల దర్శనానికి రాన్నునట్లు ఆమె తెలిపారు. విఐపిలకు పాసులు ఇస్తున్నామని వారు సామాన్యులకు ఇబ్బంది కలగకుండా దర్శనం చేసుకోవాలని మంత్రి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. జాతరలో 16,000 వేల మంది కింది స్థాయి సిబ్బంది పనిచేస్తున్నట్లు వివరించారు. అలగే 12,000 వేల మంది పోలీసు సిబ్బంది పనిచేస్తున్నట్లు తెలిపారు. శానిటేషన్, స్నానఘట్టాలు, మీడియా పాయింట్, తాగునీరు, అన్నింటి పరిధి పెంచినట్లు చెప్పారు. 40 బైక్ అంబులెన్స్ లను భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. క్యూ లైన్ లను విస్తృతంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page