Medaram Mahajatara: వరంగల్, జనత న్యూస్: తెలంగాణ గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ శుక్రవారం మేడారంలో పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క గవర్నర్ కు సాదరంగా ఆహ్వానం పలికరారు. సమ్మక్క, సారక్కజాతర సందర్భంగా అమ్మవార్లను దర్శించికొని మొక్కులు చెల్లించారు. ఈ సందర్భంగా గవర్నర్ నిలువెత్తుబంగారాన్ని అమ్మవారికి సమర్పించారు. గవర్నర్ తో పాటు కేంద్ర మంత్రి అర్జున్ ముండా అమ్మవార్లను దర్శించుకున్నారు. వీిరితో ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. మరోవైపు గద్దెలపై సమ్మక్క, సారక్కలు కొలువై ఉన్నందున భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. తెలంగాణ నుంచే కాకుండా ఒడిశా, ఛత్తీస్ ఘడ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలనుంచి వస్తున్నారు. ఈ క్రమంలో ఎటు చూసినా జనప్రవాహమేకనిపిస్తుంది.
Medaram Mahajatara: అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్ తమిళసై
- Advertisment -