Pawan Kalyan : మేయర్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థి జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు కోరారు. అయితే ఇది మన దేశంలో కాదు… బ్రిటన్ లో.. బ్రిటన్ లోని లండన్ మేయర్ ఎన్నికలు జరనున్నాయి. ఈ ఎన్నికల్లో ఇండిపెండెట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న భాతర సంతతికి చెందిన తరుణ్ గులాటీ హైదరాబాద్ లో పవన్ ను కలిశారు. తాను పోటీ చేస్తున్న ప్రాంతంలో పవన్ కల్యాణ్ అభిమానులు, జనసైనికులు ఎక్కువగా ఉన్నారని, అందువల్ల పవన్ మద్దతు కోరినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా పవన్ సానుకూలంగా స్పందించినట్లు తరుణ్ గులాటీ తెలిపారు. అయితే పవన్, తరుణ్ గులాటీలు కలిసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
