Vijayawada: ఆంధ్రప్రదేశ్ 175 ఎమ్మెల్యే , 25 ఎంపీ స్థానాలకు సోమవారం ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో 78 శాతానికి పైగా పోలింగ్ నమోదయిందని ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది. ఏపీలో పట్టణాల నుంచి గ్రామాల వరకు అన్నిచోట్ల ఎలక్షన్ జోష్ కనిపించింది. పౌరులు ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొన్నిచోట్ల ఓటర్లు ఉండడంతో రాత్రి 11 గంటల వరకు కూడా పోలింగ్ సాగింది. పల్నాడు, నరసరావుపేట, తెనాలి, తాడిపత్రి వంటి కొన్నిచోట్ల ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని గ్రామాల్లో టిడిపి, వైసిపి కార్యకర్తల మధ్య దాడులు జరిగాయి. తెనాలిలో వైసిపి అభ్యర్థి అన్నా బత్తిని శివకుమార్ క్యూ లైన్ లో ఉన్న ఓటర్ పై చేయి చేసుకున్నాడు. దీనిపై ఆగ్రహం చెందిన ఈసీ పోలింగ్ అయ్యే వరకు అతన్ని హౌస్ అరెస్టు చేయించింది. ఆ తరువాత కేసు నమోదు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల నుంచి ఈవీఎం, వీవీ ప్యాడ్లను హెలికాప్టర్లో రంపచోడవరంలోని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. మొత్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని ఏపీ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు.
ఏపీలో భారీగా పోలింగ్ నమోదు
- Advertisment -