- రైతులతో బలవంతపు పాలసీలు
- చైర్మన్ ఆగడాలకు రైతుల బెంబేలు
పెద్దపల్లి, జనతా న్యూస్: పెద్దపల్లి జిల్లా ముత్తారం సింగిల్ విండోలో జరిగిన అక్రమాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ సహకార శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని, లక్షల్లో ప్రజాధనాన్ని వృథా ఖర్చు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ మేరకు తాజాగా జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు మద్దెల రాజయ్య కలెక్టర్ కు ఫిర్యాదు చశారు. గత ఐదు సంవత్సరాలుగా ఇక్కడ కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని, దీనిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చశారు. ఆయన ఫిర్యాదు ప్రకారం.. అసలేం జరిగిందంటే?

ముత్తారం మండలంలో సివిల్ సప్లయి సహకార శాఖ, మార్కెటింగ్ ఆధ్వర్యంలో ప్రతీ సీజన్లో వరిధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఈ కొనుగోలుకు అవసరమైన గన్నీ సంచులను ప్రభుత్వమే సరఫరా చేస్తుంది. అయితే వాటిని కుట్టడానికి కావాల్సిన దారాలను కొనుగోలు కేంద్రాల వారే భరించాలి. కానీ ఈ దారాల కొనుగోళ్లలో కొందరు అక్రమాలకు పాల్పడి లక్షల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపిస్తున్నారు. కేవలం సుతిల్ కొనుగోళ్లకు లక్షల రూపాయల ఖర్చు అవుతుందనడం ఎంత వరకు సమంజసం అని అంటున్నారు. వీటితో పాటు వాటర్ బిల్లు, స్థలం అద్దె, కార్యాలయ మెయింనెన్స్ ఖర్చుల కింద ఇష్టమొచ్చినట్లు బిల్లులు పెడుతున్నారని అన్నారు. ముత్తారం సింగిల్ విండో కార్యాలయంలో మూడేళ్లుగా సుతిలి కొనుగోలు పేరిట కోట్లాది రూపాయలు పక్కదారి పట్టినట్లు రోపణలు వస్తున్నా.. ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదని అంటున్నారు. ముత్తారం సహకార సంఘం నుంచి సరఫరా అయ్యే ఎరువులు, పురుగుల మందులను ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించుకుంటూ సొమ్ము చేసుకుంటున్నారని అంటున్నారు.
ఇదే కాకుండా సింగిల్ విండో లో సభ్యులుగా ఉన్న ప్రతి ఒక్కరి చేత తప్పనిసరిగా పాలసీ చేయాలని ఒత్తిడి చేస్తున్నారని, వీటి పేరిట రూ.20 నుంచి 50 వేల వరకు దండుకుంటున్నారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఓ ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీతో సింగిల్ విండో చైర్మన్ గుజ్జుల రాజిరెడ్డి, అతని భార్య, కొడుకు ఏజెంట్ గా ఉన్నారని, వారి టార్గెట్ కోసం గుజ్జుల రాజారెడ్డి తన పదవిని అడ్డుకుంటూ లక్షల రూపాలయలు దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇంతటి అక్రమాలకు కారకుడైన గుజ్జుల రాజారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.