హనుమకొండ, జనతా ప్రతినిధి
ఎనుకట పెళ్లి చేస్తే సప్పుల్లకు, పెళ్లి పల్లకి, భోజనాల ఖర్చు అయ్యేవి.. మా అంటే వేల రూపాయల ఖర్చు ఉండేది… ఇప్పుడు వేలు కాదు లక్షల కాదు కోట్ల రూపాయల ఖర్చవుతుంది… పెళ్లి ఖర్చు విషయంలో తగ్గేది లేదంటూ అటు వరుడు ఇబు వధువు తరపున రూపాయల ఖర్చు చేస్తూ హంగు ఆర్భాటాల నడుమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు.. ముచ్చటగా సాగే మూడుముళ్ల బంధం జీవితంలో జరిగే ఏకైక ఘట్టం దాన్ని అందంగా ఆనందంగా ఆస్వాదించాలన్న ఆలోచన నేటితరంది. అందుకే లక్షల రూపాయలు కాదు, కాదు కాదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నరు.. వేసుకునే డ్రెస్ నుండి.. తీసుకునే ఫోటోలు,, తినే తిండి అంతా కాస్ట్ మయం అయిపోయింది.. ఎంగేజ్మెంట్ మొదలుకొని రిసెప్షన్ వరకు పెళ్లి తంతు అంతా ఆర్భాటాలకు తెరలేపిండ్లు.. దీంతో ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో పెళ్లి ఖర్చు ఎక్కువగా ఉందట. పేదలు 3 లక్షల రూపాయలు, దిగువ మధ్య తరగతి ఆరు లక్షలు, మధ్యతరగతి కుటుంబాలు 10 నుండి 25 లక్షలు, కోటీశ్వరులు 50 లక్షల నుండి కోటి పైన పెళ్లి కోసం ఖర్చు చేస్తున్నట్లు ఓ సర్వేలో తేలింది. మనదేశంలో చదువు కంటే పెళ్లికి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని చదువు కోసం సగటున 3.3 లక్షలు ఖర్చు చేస్తే. పెళ్లి కోసం 12.6 లక్షలు ఖర్చు చేస్తున్నారని చెబుతున్నారు.. రాను రాను ఈ పెళ్లి ఖర్చు మరింతగా పెరిగిపోయి తడిసి మోపడే అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది…