రాయికల్, జనతా న్యూస్: మండలంలోని వీరాపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకులు దిండిగాల రామస్వామి గౌడ్, ఉప్పుమడుగు ఫ్యాక్స్ వైస్ చైర్మన్ దుంపల స్వామిరెడ్డి, ఫ్యాక్స్ డైరెక్టర్ సుందరగిరి మురళి, చెదల శంకర్, నీలి రాజమల్లయ్య, ముక్కెర నరేష్, నీలి నర్సయ్య, సోమ రాజు, జవ్వాజి అక్షయ్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 సంక్షేమ పథకాలకు ఆకర్షితులై జగిత్యాలలోని ఇందిరా భవన్ లో జకిలేటీ రాజు రావు(లక్ష్మీ నరసింహారావు) ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొండపల్లి రవీందర్ రావు, సోమ వెంకటేష్, సుందరగిరి గంగాధర్, దిండిగాల జగన్, జవ్వాజి నవీన్, దుంపల నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో పలువురు చేరిక
- Advertisment -