ఇల్లంతకుంట, జనతా న్యూస్ నవంబర్ 27: ఇల్లంతకుంట మండల కేంద్రంలోని పలువురు నాయకులు మానకొండూరు కాంగ్రెస్ అభ్యర్థి కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. బీఆర్ఎస్ ఉద్యమ నాయకుడు, వార్డు మెంబర్ అవార్ బాలయ్య జెట్టి రాజయ్య, ఆకుల బాలయ్య మాల మహానాడు పెద్దలు మామిడి నరసయ్య మామిడి బాలమల్లు మామిడి రాజయ్య లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. తామందరం పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు ఉప్పల అమర్ చిట్టి ప్రదీప్ రెడ్డి మామిడి రాజు ఒగ్గు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
అదేవిధంగా ఇల్లంతకుంట మండలం రామాజీపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరిని ఇల్లంతకుంట ఎంపీపీ ముట్కూరి రమణారెడ్డి కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన యువకులు కాంగ్రెస్ అభ్యర్థి కవంపల్లి సత్యనారాయణ గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాజీ ఎంపీపీ గుడిసె ఐలయ్య యాదవ్ మానకొండూరు నియోజకవర్గం యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అంతగిరి వినయ్ కుమార్ మానకొండూరు నియోజకవర్గం అధికార ప్రతినిధి పసుల వెంకటి గ్రామ శాఖ అధ్యక్షుడు భూమయ్య తదితరులు పాల్గొన్నారు.