Saturday, March 14, 2026

కుక్కల దాడిలో పలువురికి గాయాలు

ఇల్లంతకుంట జనవరి 24 (జనతా న్యూస్) కుక్క దాడి చేసిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా మరో ఐదుగురు స్వల్ప గాయాల పాలయ్యారు ఇల్లంతకుంట మండలం పొత్తూరు లో మంగళవారం సాయంత్రం వేళ జరిగిన ఈ ఘటన వివరాలు గ్రామస్తులు తెలిపిన ప్రకారం ఇలా ఉన్నాయి. మంగళవారం నాడు సాయంత్రం నాలుగు గంటల సమయంలో  దారిలో నడుచుకుంటూ వెళ్తున్న వడియాల రాజిరెడ్డి, మేదరి మల్లేశం, ఆకుల రాజు, గుంటి వైష్ణవి మరో అమ్మాయిని కుక్క దాడి చేయడంతో  గాయాల పాలయ్యారు. ఇకపోతే నాలుగేళ్ల వడియాల సార్నిక, 80 ఏళ్ల గుంటి అయిలవ్వ,  వేణు లకు తీవ్ర గాయాలయ్యాయి.  సార్నిక అనే పాప సీరియస్ గా ఉండడంతో కరీంనగర్ తరలించి ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు.

అదేవిధంగా ఐలవ్వ, వేణులను కరీంనగర్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. కుక్క దాడిలో గాయపడ్డ వారిని ఇల్లంతకుంట ఎంపీపీ వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ నాయకులు ఓగులాపూర్ పొత్తూరు గ్రామాల మాజీ సర్పంచులు కేశవరెడ్డి ఆకుల సత్యములు బుధవారం నాడు ఆస్పత్రిలో బాధితులను చూసి వారికి ధైర్యం చెప్పారు భయపడాల్సింది ఏమీ లేదని మెరుగైన వైద్యం అందుతుందని బాధితులకు ధైర్యం చెప్పారు బాధితులందరూ కోలు కుంటున్నారు.పొత్తూరు గ్రామాన్ని ఇల్లంతకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్ శరణ్య గారు సందర్శించి కుక్క కాటుకు గురై ఇంటి వద్ద ఉన్న ఐదుగురికి వ్యాక్సిన్ వేసినట్టు తెలిపారు

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page