నటుడు, కేంద్ర మంత్రి వ్యాఖ్యలపై చర్చ..
జనత డెస్క్ :
మలయాళ నటుడు, కేంద్ర మంత్రి సురేశ్ గోపి ఇటీవల కేరళ చలన చిత్ర మండలి కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు సినీ అభిమానుల్లో చర్చకు తెరలేపాయి. ‘తుది శ్వాస సినిమా నేనని, అది లేక పోతే బతుక లేనని’ పేర్కొనడం.. ఆయన అభిమానుల్లో ఆసక్తి కల్గించింది. కేంద్ర మంత్రి కన్నా, సినిమానే మిన్న అన్నట్లుగా మలయాళ సూపర్ స్టార్ సరేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు సినీ రంగంలోనూ చర్చకు దారి తీశాయి. 22 సినిమాలకు ఓకే చెప్పిన సురేశ్ గోపి..షూటింగ్ తదితర వ్యక్తిగత పనులకు మోదీ ప్రభుత్వం అనుమతిస్తుందన్న ఆశాభావంలో ఉన్నారట. కేరళ త్రిసూర్ నుండి మొదటి బీజేపీ లోక్‌సభ సభ్యులుగా ఎన్నికై కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు, పర్యాటక శాఖ సహాయ మంత్రిగా ఉన్న నటుడు సురేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు..సర్వత్రా ఆలోచింప జేస్తున్నాయి.
ఇటీవల చెన్నై లో తమిళ సినీ ప్రముఖ నటుడు, తమిళగ వెట్రి కజగం అధ్యక్షుడు విజయ్ పార్టీ జెండాను ఆవిష్కరించి, క్రీయశీల రాజకీయాల్లోకి వస్తారనే సంకేతాలిచ్చారు. ఏపీలో పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా పూర్తి స్థాయి పరిపాలనలో బిజీగా గడుపుతున్న నేపథ్యంలో.. కేరళకు చెందిన మలయాళ నటుడు సురేశ్ గోపి చేసిన వ్యాఖ్యలు ఇందుకు భిన్నంగా ఉన్నట్లు సినీ అభిమానుల్లో చర్చ జరుగుతుంది.
మంత్రి పదవి కన్న..సినిమానే మిన్న
- Advertisment -