అభివృద్ధి లో ఆదర్శం మంథని..
ప్రణాళికల రూప కల్పనకు అధికారులకు ఆదేశాలు
నియోజక వర్గంలో సుడిగాలి పర్యటనలు
మంథని నియోజక వర్గంపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఫోకస్ పెట్టారు. రాష్ట్ర రాజకీయాలు, అభివృద్ధి, ప్రభుత్వ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న ఆయన..తన సొంత నియోజక వర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా మంథని పట్టణంతో పాటు నియోజక వర్గంలోని అభివృద్ధి పనుల వేగవంతానికి కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం మంథని నియోజక వర్గ కేంద్రంలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. మరి కొన్ని పనుల ప్రణాళికలకు అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్ బాబు.
పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలసి పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. రూ. 24. 50 లక్షల 15వ ఆర్థిక సంఘం నిధులతో కొనుగోలు చేసిన మూడు స్వచ్ఛ ఆటోలకు జెండా ఊపి ప్రారంభించారు. రూ.13 .95 కోట్లతో పట్టణంలోని రోడ్లు, డ్రైనేజీ, ఇతర అభివృద్ధి పనులను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ..పట్టణంలో మున్సిపల్, వెజ్, నాన్ వెజ్ మార్కెట్ భవనాల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. మహిళలచే 12 రకాల వాణిజ్య వ్యాపార యూనిట్ల ద్వారా మార్కెట్ లో డిమాండ్ ఉన్న వ్యాపారాల ద్వారా ఆర్థికాభివృద్ధి చేసుకునే వెసులుబాటు కల్పించినట్లు తెలిపారు. మంథని ప్రాంతంలో రూ. 40 లక్షల వ్యయంతో 25 మహిళా సంఘాలచే మైక్రో ఎంటర్ప్రైజెస్ ఏర్పాటు చేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం 165 మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల 67 లక్షల బ్యాంక్ లింకేజీ రుణాలు పంపిణీ చేస్తున్నామని, వీటి ద్వారా ఆర్థికాభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.
అభివృద్ధిలో మంథని పట్టణాన్ని ఆదర్శంగా తీర్చి దిద్దేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు.
డయాలసిస్ కేంద్రం ప్రారంభం
మంథని పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో 5 పడకల డయాలసిస్ కేంద్రాన్ని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. డయాలసిస్ కేంద్రం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఇన్ ఫె˜క్షన్ వచ్చే ప్రమాదం సూచించారు. మంథని ప్రాంతంలో డయాలసిస్ కేంద్రాన్ని ఏర్పాటుచేసిన రాష్ట్ర వైద్య`రోగ్య శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం, సీఎంలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. డయాలసిస్ సేవలు పొందుతున్న రోగుల సంఖ్య ఆధారంగా అవసరమైన పరికరాల అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులకు సూచించారు.