Manthani : మంథని, జనతా న్యూస్ : అసెంబ్లీ ఎన్నికల మీడియా మంథని డివిజన్ కన్వీనర్ గా మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ను నియమిస్తూ పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఉత్తర్వులు జారీచేశారు. ఈమేరకు మంథని లో ఎఐసిసి కార్యదర్శి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు చేతుల మీదుగా నియామకం ఉత్తర్వులు అందించారు. మంథని డివిజన్ లోని మంథని రామగిరి ముత్తారం,కమాన్ పూర్ మండలాల్లో త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ని బలోపేతం చేయడానికి గాను అవసరమైన మీడియా సహకారాన్ని తీసుకొని కృషి చేయాలని కోరారు.తన నియామకానికి కృషి చేసిన మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు జిల్లా అధ్యక్షులు మక్కాన్ సింగ్ యువ నాయకులు దుద్దిళ్ల శ్రీను బాబు మీడియా సోదరులకు మంథని డివిజన్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
Manthani : మంథని డివిజన్ అసెంబ్లీ ఎన్నికల మీడియా కన్వీనర్ నియామకం
- Advertisment -