మంథని, జనతా న్యూస్: మంథని పట్టణంలో ప్రభుత్వం క్రైస్తవుల కోసం ఇచ్చిన సమాధుల స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుకు క్రైస్తవ సంఘాల ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. సోమవారం మంథని పట్టణం మంత్రి నివాసంలో క్రైస్తవ సమాధుల స్థలం అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఆయనను కలిసి వినతి పత్రం అందజేశారు. క్రైస్తవ సమాధుల స్థలానికి కాంపౌండ్ వాల్ నిర్మాణానికి రూ.25 లక్షల నిధులు మంజూరు చేయాలని ఈ సందర్భంగా ఆయనను కోరారు. ఈ సందర్భంగా క్రైస్తవ సమాధుల స్థలాన్ని ఎవరు ఆక్రమించుకోకుండా రెవిన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు చూడాలని శ్రీధర్ బాబు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సమాధుల స్థలం అభివృద్ధి కమిటీ అధ్యక్షులు ఐతు ఎలిషా ప్రధాన కార్యదర్శి వల్లూరి ప్రభాకర్, కోశాధికారి నతానియల్, ఉపాధ్యక్షులు తామస్, సహయ కార్యదర్శి అజ్మీర దయా రాజు, పాస్టర్లు శ్రీనివాస్, కృపాకర్, డేవిడ్, నవీన్, రాజేష్, జోసఫ్, సంఘ పెద్దలు అంకరి కుమార్, మంథని ప్రసాద్, అందే రమేశ్, తదితరులు పాల్గొన్నారు
మంథని: సమాధుల స్థలాన్ని ఆక్రమించుకున్న వారిపై చర్య తీసుకోవాలి
- Advertisment -