- సీఎం, మంత్రులతో సంబంధం ఉన్న నియోజకవర్గం
- జిల్లా అధ్యక్షులు కూడా ఇక్కడివారే
- వచ్చే ఎన్నికల కోసం రసవత్తర పోరు
- రెండు పర్యాయాలు గులాబీ జెండానే
- ఈసారి ఎవరిదో గెలుపు
బూట్ల సూర్యప్రకాష్ ( మానకొండూరు నియోజకవర్గం ప్రత్యేక ప్రతినిధి)
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలవేడి సంతరించుకుంది. నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో ఓటరు ఫలితం ఎలా ఉంటుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పార్టీ నాయకులు గెలుపుకోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తెలంగానలో ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో ప్రత్యేకత సంతరించుకుంది. కానీ కరీంనగర్ జిల్లాలోని మానకొండూర్ నియోజకవర్గం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఆ వివరాల్లోకి వెళితే..
తెలంగాణ రాష్ట్రంలో ఏ నియోజక వర్గానికి లేని ప్రత్యేకత ‘మానకొండూర్’కు ఉంది. ఈ నియోజక వర్గం భౌగోళికంగా మూడు జిల్లాలతో ముడిపడి ఉంది. అయా జిల్లాలకు చెందిన వారిలో ఒకరు రాష్ట్ర ముఖ్యమంత్రిగా.. ముగ్గురు మంత్రులు, రెండు పార్టీల జిల్లా అధ్యక్షులతో అనుబంధం వుంది. వివరాలలోకి వెళితే నియోజవర్గం లోని గన్నేరువరం, తిమ్మాపూర్,మానకొండూర్, శంకరపట్నం మండలాలు కరీంనగర్ జిల్లాలో, బెజ్జంకి మండలం సిద్దిపేటలో, ఇల్లంతకుంట మండలం రాజన్న సిరిసిల్ల జిల్లాలో వున్నాయి. సిద్దిపేట జిల్లా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్, రాష్ట్ర వైద్య శాఖ మంత్రి బెజ్జంకి మండలం లోని తోటపల్లి గ్రామానికి చెందిన తన్నీరు హరీష్ రావు, అలాగే రాజన్నసిరిసిల్ల జిల్లా నుంచి కేసీఆర్ తనయుడు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, కరీంనగర్ జిల్లా నుంచి మంత్రి గంగుల కమలాకర్, ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు తెలంగాణ ఉ్యమకారులు ధూం ధాం కళాకారుడు రసమయి బాలకిషన్ హ్యాట్రిక్ విజయం కోసం బరిలో నిలిచారు. అలాగే బీ ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణ రావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కవ్వంపెల్లి సత్యనారాయణ మనకొండూర్ నియోజక వర్గం నకు చెందిన వారు.
2014,2018 లో జరిగిన ఎమ్మెల్యే ఎన్నికలలో వరుసగా రసమయి బాలకిషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పై భారీ మెజారిటీతో గెలిచారు. కానీ ఇప్పుడు గెలుపు అంత సునాయసం కాదని విశ్లేషకుల అభిప్రాయం. ఇది గమనించిన రాష్ట్ర బీ అర్ స్ నాయకులు సైతం ఈ నియోజక వర్గం మీద ప్రత్యేక దృష్టి సారించినట్ట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే మంత్రి హరీష్ రసమయి గెలుపు కోసం ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుత క్యాడర్ ను దూరంగా ఉన్న వారిని సైతం ఒప్పించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు తెలిసింది. అలాగే ఇల్లంతకుంట మండాలన్ని కేటీఆర్ కరీంనగర్ జిల్లా మంత్రి గంగుల కమలాకర్ కూడా గన్నేరువరం,తిమ్మాపూర్,మాన కొండూర్, శంకరపట్నం మండలాల బాధ్యతలు తీసుకొన్నట్లు తెలిసింది. ఏదీ ఏమైనా నియోజక వర్గంలో రసమయి గెలుపు దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలుస్తోంది. అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కవ్వంపెల్లి సత్యనారాయణ కు రాష్ట్ర పార్టీ నాయకులు ఎవరూ ప్రచార పర్వంలో పాలు పంచుకోవటం లేదని అన్నీ తానై ఒంటరి పోరు చేస్తున్నారని పలువురు అభిప్రాయ పడుతున్నారు. ఇన్ని ప్రత్యేకతలు ఉన్న మానకొండూర్ నియోజకవర్గంలో ఈసారి ఎవరి జెండా ఎగురవేస్తారో చూడాలి.