Sunday, March 15, 2026

 వైభవంగా కాశీ లింగేశ్వరస్వామి  దేవాలయ ప్రతిష్ట మహోత్సవం 

బెజ్జంకి టౌన్, జనతా న్యూస్:నూతనంగా సుమారు కోటి రూపాయల వ్యయంతో నిర్మించిన శ్రీ కాశీ లింగేశ్వర స్వామి వారి దేవాలయం ప్రతిష్టా మహోత్సవాలు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని లక్ష్మీపూర్ గ్రామంలో మంగళవారం వేద పండితులతో , వేదమంత్రాల మధ్య, వాయిద్యాలతో , మేల తాళాలతో , అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి.

bejjanki kashi 3
bejjanki kashi 3

ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఆగమన శాస్త్ర పండితులు మునగ నేటి శర్మ ఆధ్వర్యంలో పలువురు వేద పండితులతో మొదలు అయ్యాయి. మూడు రోజులపాటు సాగే ఈ ఉత్సవాలలో భాగంగా మొదటి రోజున ప్రతిష్ట దేవతామూర్తుల విగ్రహాలకు, ధ్వజస్తంభానికి స్నానాధి కార్యక్రమాలు జరిపి , పసుపు కుంకుమలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తుల విగ్రహాలను మంగళ వాయిద్యాలతో పలువురు యాగశాల ప్రవేశం చేయించి , ధాన్యరాశిలో పవళింప చేశారు. అంతకుముందు గోపూజ, గణపతి పూజ, పుణ్యాహవచనము, పంచగవ్య ప్రాసన, మూలమంత్ర జపములు, వేద పండితులు చేశారు . గ్రామానికి చెందిన 32 మంది దంపతులచే యాగ పూజలను ఘనంగా నిర్వహించిన , అనంతరం ధ్వజస్తంభ ప్రతిష్టాపన కొరకు ప్రత్యేకంగా తీసిన గోతిలో వేదమంత్రాల మధ్య తామ్రపత్రాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత క్రేన్ సాయంతో మంగళ వాయిద్యాల మధ్య శివనామ స్మరణలతో భక్తి శ్రద్ధలతో ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాలను తిలకించటానికి పలువురు గ్రామ ప్రజలు చుట్టుపక్కల గ్రామస్తులు తరలి వచ్చారు . అన్నదాన వితరణ కార్యక్రమం చేపట్టారు.

- Advertisment -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Trending...

Most Popular

You cannot copy content of this page