హైదరాబాద్, జనత న్యూస్: గత నెల రోజులుగా పుష్యమాసం కావడంతో పెళ్లి భాజాగా మోగనున్నాయి.. శుభకార్యాలు సాగనున్నాయి.. ఎందుకంటే ఫిబ్రవరి 9న అమావాస్యతో మాఘమాసం ప్రారంభం కానుంది. మాఘమాసంలో పెళ్లిళ్ల జోరు బాగానే ఉంది. ఫిబ్రవరి 10 నుంచి శుభముహుర్తాలు అధికంగా ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీంతో గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలు, జరగనున్నాయి. ఫిబ్రవరి 10 నుంచి ఏప్రిల్ 14 వరకు మంచిరోజులు కొనసాగుతాయని పండితులు చెబుతున్నారు. ఆ తరువాత 18,19,20,21,24 తేదీల్లో మాత్రమే మంచిరోజులు ఉంటాయని అంటున్నారు. ఆ తరువాత మళ్లీ రెండు నెలల పాటు మంచి రోజులకు బ్రేక్ పడనుంది. ఏప్రిల్ 30 నుంచి మూఢం ప్రారంభమై నెల రోజుల పాటు ఉంటుంది. అపందువల్ల ఈ రెండు నెలల కాలంలో పెళ్లిళ్లు జోరుగా సాగుతాయి.
కొందరు పండితులు చెబుతున్న ప్రకారం వివాహాలకు 4,7,8,12,13,17,24,25,26,29 తేదీతో నిర్వహించుకోవచ్చని అంటున్నారు.గృహ ప్రవేశానికి 12,14,19,26,28 తేదీలో మంచిరోజులు. మంచిరోజుల కారణంగా చాలా మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంది. ఇదే సమయంలో సమ్మక్క, సారలమ్మ జాతర ఉండడంతో వ్యాపారాభివృద్ధి చెందనుంది.