ప్రముఖ యూటూబర్ హర్షసాయిపై టుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు హైదరాబాద్ నార్సింగ్ పోలీసులు. గత నెలలో హర్షసాయిపై అత్యాచార కేసు నమోదు కాగా..పోలీసులకు దొరక కుండా తప్పించుకుని తిరుగుతున్న విషయం తెలిసిందే. ఫోటోలు, వీడియోలు చూపించి తనను బ్లాక్ మెయిల్‌కు గురి చేస్తున్నాడని ఓ నటి గతంలో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు పలువురు బాధితులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతన్ని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. అయినప్పటికీ ఫలితం లేక పోవడంతో, విదేశాలకు పారిపోతాడని పలువురు పోలీసు అధికారులకు సూచించడంతో..హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు పోలీసులు.
హర్షసాయిపై లుక్ అవుట్ నోటీసులు

- Advertisment -