- బరిలో స్వతంత్ర అభ్యర్థులే అధికం..
- 5 మంది నామినేషన్ల ఉపసంహరణ
కరీంనగర్,జనత న్యూస్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సోమవారం నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియను ముగిసిందని 28 మంది అభ్యర్థులు బరిలో నిలువగా..ఐదుగురు స్వతంత్ర అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను ఉపసంహరించుకున్నారని ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సోమవారం తెలిపారు. 18వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నామినేషన్ల ప్రక్రియ సాగగా 53 మంది అభ్యర్థులు 94 నామినేషన్లను దాఖలు చేశారని కలెక్టర్ తెలిపారు.నామినేషన్ల పరిశీలన ప్రక్రియలో 20 మంది అభ్యర్థుల వివరాలు, పత్రాలు సరిగా లేకపోవడంతో నామినేషన్లను తిరస్కరించామని 33 మంది అభ్యర్థుల్లో ఐదుగురు అభ్యర్థులు తమ నామినేషన్లు పత్రాలను ఉపసంహరించుకోగా కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో ప్రధాన పార్టీ అభ్యర్థులతో పాటు మొత్తం 28 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారని జిల్లా కలెక్టర్ తెలిపారు.
పెద్దపల్లి బరిలో 42 మంది అభ్యర్థులు
- పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్
- 7 మంది అభ్యర్థులు నామినేషన్ ఉపసంహరణ
పెద్దపల్లి,జనత న్యూస్:పెద్దపల్లి పార్లమెంటు స్థానంలో 7 మంది అభ్యర్థుల నామినేషన్ విత్ డ్రా చేసుకోగా 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు.సోమవారం పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యలయంలో పెద్దపల్లి ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తాతో కలిసి ఎన్నికలలో పోటీ చేస్తున్న అభ్యర్థుల సమక్షంలో గుర్తులను కేటాయించారు.ఈ సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి ముజమ్మిల్ ఖాన్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు 63 మంది అభ్యర్థులు 109 సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారని,ఏప్రిల్ 26న నిర్వహించిన స్క్రూటిలో వివరాలు అసంపూర్తిగా ఉండి,ఈసీ నిబంధనలు పాటించని కారణంగా 14 మంది అభ్యర్థుల నామినేషన్ పత్రాలను తిరస్కరించామని తెలిపారు. 49 మంది అభ్యర్థులలో ఉప సంహరణ గడువు ముగిసే వరకు 7 మంది అభ్యర్థులు తమ నామినేషన్ పత్రాలను విత్ డ్రా చేసుకోగా 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు రిటర్నింగ్ అధికారి తెలిపారు.ఎన్నికలలో పోటీ చేసే స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమీషన్ నిర్దేశించిన మార్గదర్శకాలను పాటిస్తూ పారదర్శకంగా గుర్తుల కేటాయింపు చేశామని తెలిపారు. తెలుగు అక్షరమాల ప్రకారం బ్యాలెట్ పేపర్ లో క్రమ సంఖ్య ఏర్పాటు చేయడం జరుగిందని తెలిపారు.పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు రావీష్ గుప్తా మాట్లాడుతూ ప్రతి ఎన్నికలకు నిబంధనలు మారుతూ ఉంటాయని, ఎన్నికల సందర్భంగా మనమంతా తప్పనిసరిగా ఎన్నికల కమీషన్ నిర్దేశించిన నిబంధనలు తెలుసుకొని పాటించాలని అన్నారు.ఎన్నికల ప్రచార నిమిత్తం నిర్వహించే ప్రతి సమావేశం ర్యాలీ, సభలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని, ఎన్నికల ప్రచారం కోసం వినియోగించుకునే ప్రతి ఖర్చు వివరాలు అభ్యర్థులకు కేటాయించిన పుస్తకాలలో నమోదు చేయాలని సూచించారు.ఈ సమావేశంలో అభ్యర్థులు,సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.