Loksabha Election 2024:తెలంగాణవ్యాప్తంగా 17 లోక్ సభ నియోజకవర్గాల్లో ఎలాంటి చెదురుమదురు ఘటనలు లేకుండా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 9.51 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారికంగా వెలువడింది. ఓటింగ్ లో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ జ్యోతినగర్ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు. కొందరు ఓటర్లను ప్రలోభ పెడుతున్నారని, వారిని పట్టించుకోకుండా దేశం, ధర్మం కోసం ఓటు వేయాలని కోరారు. అమ్మవారి దయ వల్ల వాతావరణం చల్లగా ఉందని, దీంతో ప్రజలందరూ ఓటు హక్కు వినియోగించుకుంటారని అన్నారు.
Loksabha Election 2024: ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్.. ఉదయం 9 గంటల వరకు ఎంత శాతం అంటే?
- Advertisment -