తిరుపతి, జనతా న్యూస్: తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు లోకేశ్ కుటుంబ సభ్యులతో సహా తిరుమలలో పర్యటించారు. లోకేశ్, బ్రహ్మిణిల కుమారుడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఉదయం శ్రీవారిని దర్శించుకున్నారు. వీరితో ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి ఉన్నారు. దేవాన్స్ పుట్టిన రోజు సందర్భంగా అన్నప్రసాదానికి రూ.38 లక్షలడీడీని ఒక రోజు విరాళంగా ఇచ్చారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో అర్చకులు వారికి వేదాశీర్వచనం చేశారు. అలాగే గాయత్రి నిలయం అతిథి గృహం వద్ద టీటీడీ రిసెప్షన్ అధికారులు వారికి ఘన స్వాగతం పలికారు.
తిరుమల అన్నప్రసాదానికి లోకేష్ భారీ విరాళం..
- Advertisment -