రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు దంపతుల హోమం
మంథని-జనత న్యూస్
లోక కళ్యాణార్థం హోమం నిర్వహించారు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, శైలజ రామయ్యార్ దంపతులు. పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని రావుల చెరువుకట్ట వద్ద గజానన సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు గణనాథుని ఆశీస్సులతో సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. అనంతరం మంత్రి శ్రీధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ.. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ లో చేసిన వ్యాఖ్యలు చూస్తే అర్థం అవుతుందని అన్నారు. బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తాను బీఆర్‌ఎస్‌లోనే ఉన్నట్ల ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఇక్కడి ప్రజలందరూ తెలంగాణ వారే నని, వారందరినీ గౌరవిస్తామన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని ,రాజకీయాలకు అతీతంగా ఈ ఇమేజ్ నీ మరింత పెంచడంలో అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ ప్రతిష్టన కొన్ని ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతితులు తదితరులు పాల్గొన్నారు
లోక కళ్యాణార్థం..

- Advertisment -