- జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
- వెలిచాల,వెదిరలో మోడల్ పోలింగ్ స్టేషన్ల పరిశీలన
కరీంనగర్,జనత న్యూస్: ఎన్నికల ప్రాసెస్ చాలా సిస్టమేటిక్ గా స్మూత్ గా జరిగిందని.. చాలా హ్యాపీగా ఉందని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు.నేడు పోలింగ్ ప్రక్రియ కూడా బాగా జరిగేలా చూడాలని సిబ్బందికి సూచించారు. ఆదివారం రామడుగు మండలం వెలిచాలలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏర్పాటుచేసిన ఆదర్శ మహిళ పోలింగ్ స్టేషన్ ను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పోలింగ్ స్టేషన్లో చేపట్టిన ఏర్పాట్లను పరిశీలించారు. వెదిర గ్రామంలో దివ్యాంగుల మోడల్ పోలింగ్ స్టేషన్ ను వారు పర్యవేక్షించారు.అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు,వయోవృద్ధులు,గర్భిణీలు ఇబ్బందులు పడకుండా ఓటు హక్కు వినియోగించుకునేలా పోలింగ్ బూతుల వారీగా ఆటోలను ఏర్పాటు చేశామని తెలిపారు. దీనిపై గ్రామాల్లో సిబ్బంది విస్తృతంగా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ అవకాశాన్ని వినియోగించుకునేలా చూడాలని పేర్కొన్నారు. సిబ్బంది పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా పూర్తయ్యేలా కృషి చేయాలని తెలిపారు. మహిళా మోడల్ పోలింగ్ స్టేషన్ లో మొదట ఓటు హక్కు వినియోగించుకున్న యాభై మంది మహిళలకు పూలు పండ్ల మొక్కలను అందించాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్,జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి,ఎంపీడీవో రాజేశ్వరి,తదితరులు పాల్గొన్నారు.