స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం
బీసీ గణన చేపట్టి ఎన్నికలకు వెళ్లే యోచనలో సర్కారు
సీఎం ప్రకటన పట్ల కాంగ్రెస్ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల హర్షం
కరీంనగర్-జనత న్యూస్
స్థానిక ఎన్నికల్లో కష్టపడి పని చేసిన కార్యకర్త లను గెలిపించుకుంటామన్నారు కాంగ్రెస్‌కరీంనగర్ పార్లమెంటు ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావు. ఈ మేరకు ఆయన సోమవారం ప్రకటన విడుదల చేశారు. మూడు నెలల్లో బీసీల గణన చేపట్టి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షులు మహేశ్ కుమార్ గౌడ్ ప్రకటించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని సీఎం, టీపీసీసీ చీఫ్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కష్టపడి పనిచేసిన కార్యకర్తలను స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులుగా, ఎంపిటిసిలుగా, జడ్పిటిసిలుగా, ఎంపీపీలుగా, జడ్పీ చైర్మన్లుగా, మున్సిపల్ చైర్మన్ లుగా గెలిపించుకొని తీరుతామని స్పష్టం చేశారు. జనాభా పరంగా బీసీలకు దక్కాల్సిన వాటా అందించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉన్నదని తెలిపారు. గత బీఆర్‌ఎస్ పాలకులు బీసీలను ఏమాత్రం పట్టించుకోలేదని, వారికి తీరని అన్యాయం చేశారని మండిపడ్డారు. బీసీలను చీమను చూసినట్టు చూశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే అన్ని వర్గాలకు సమా న్యాయం జరుగుతుందని చెప్పారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో రాహూల్ గాంధీ ని ప్రధాన మంత్రిని చేయడమే లక్ష్యంగా 24 గంటలు శ్రమిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతుందని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా తీసుకెళ్తామని వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు.
స్థానిక ఎన్నికల్లో కార్యకర్తలను గెలిపించుకుంటాం

- Advertisment -