విజయవాడ, జనతా న్యూస్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోకసభ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్ మంగళవారం జాబితాను విడుదల చేశారు. కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలిగా ఉన్న వైఎస్ షర్మిల కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నాను కాకినాడ నుంచి పళ్ళెం రాజు, బాపట్ల నుంచి జెడి శీలం, రాజమహేంద్రవరం నుంచి గిడుగు రుద్రరాజు, కర్నూలు నుంచి పుల్లయ్య యాదవ్ లోక్ సభ అభ్యర్థులుగా ఉన్నారు.
అసెంబ్లీ అభ్యర్థులు వీరే..
ఇచ్ఛాపురం – మాసుపత్రి చక్రవర్తి రెడ్డి, పలాస – మజ్జి త్రినాధ్ బాబు, పాతపట్నం – కొప్పురోతు వెంకటరావు, శ్రీకాకుళం – పైడి నాగభూషణరావు, ఆమదాలవలస – సన్నపాల అన్నాజీరావు, ఎచ్చెర్ల – కరిమజ్జి మల్లేశ్వర రావు, నరసన్న – మంత్రి నరసింహ మూర్తి, రాజం (SC) – కంబాల రాజవర్ధన్, పాలకొండ (ST) – సరవ చంటి బాబు, పార్వతీపురం (SC) – బత్తిన మోహన్ రావు ,సాలూరు (ST) – మువ్వల పుష్ప రావు, చీపురుపల్లె – తుమ్మగంటి సూరినాయుడు, గజపతినగరం – గడప కూర్మినాయుడు, విజయనగరం – సతీష్ కుమార్ సుంకరి, విశాఖపట్నం తూర్పు – గుత్తుల శ్రీనివాసరావు, మాడుగుల – BBS శ్రీనివాసరావు, పాడేరు (ST) – సతక బుల్లిబాబు, అనకాపల్లి – ఇల్లా రామ గంగాధర రావు, పెందుర్తి – పిరిడి భగత్, పాయకరావుపేట (SC) – బోని తాతా రావు, తుని – గెలం శ్రీనివాస రాడ్, ప్రత్తిపాడు – ఎన్.వి.వి.సత్యనారాయణ.