బెజ్జంకి, జనత న్యూస్:జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా బెజ్జంకి మండలంలోని బెజ్జంకి క్రాసింగ్ గ్రామపంచాయతీ ఆవరణలో గురువారం ఓటు హక్కును వినియోగించుకుందాము, ఆదర్శవంతమైన ప్రజాస్వామ్య వ్యవస్థను కోరుకుందాం అని సర్పంచ్ టేకు తిరుపతి స్పష్టం చేశారు. దేశాభివృద్ధి కోసం మనమంతా, మన వంతు పాత్రను పోషిద్దామని, ఓటు అనేది ప్రజాస్వామ్య వ్యవస్థకు ఊపిరి లాంటిదని ఆయన అన్నారు. అర్హులైన వారు ఓటును నమోదు చేసుకోవాలని ఆయన కోరారు. ఆయనతో పాటుగా గ్రామ వార్డు మెంబర్ నాచారం విజయలక్ష్మి నరసయ్య తదితరులు పాల్గొన్నారు
ఓటు హక్కును వినియోగించుకుందాం
- Advertisment -
